
జయ గురుదత్త. దత్త నామంలొనె ఎదొ తెలియని మహిమ ఉన్నది.. ఈ ఫొటొలొ, పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సత్చిదానంద స్వమిజీ వారిని చూదవచ్చు. ఈ శివరాత్రి సందర్భంగా స్వమిజీ వారు తమ మైసూరు ఆశ్రమంలొ ఒక భక్తుడిని అనుగ్రహిస్తున్నట్లు మనం ఈ ఫొటొ లొ చూడవచ్చు. (నెను ఆ రొజు ఆశ్రమంలొ తీసిన ఫొటొ). కొంచెం జాగ్రత్తగా గమనిస్తే శ్రీ స్వమిజీ వారి చెయి పక్కన ఒక వెండి పాత్ర మనకి కనపడుతుంది.. ఆఅ పాత్రలొనుండి స్వమిజీ ఎదొ వస్తువుని ఆ భక్తుడికి ఇవ్వతం చూసిన నెను, నాక్కూడ ఆశ కలిగి ఎలగొ అలా ధైర్యం చెసి నెను చెతులు జాపాను. ముందు పాద నమస్కారానికి మాత్రం నాకు అనుమతి లభించింది. అదె పదివెలనుకున్నను , నన్ను నమస్కారం చెసుకొని వెళ్ళమన్నట్లుగా శ్రీ స్వమిజీ సైగ చెసారు, సరె ఇంతె ప్రాప్తం కాబొలనుకొని వెనక్కు తిరిగి వెళుతూ మళ్ళి ఒ సారి శ్రీ స్వమిజీ వైపు చూసాను, ఆశ్చర్యం, ఆనందం, నన్ను మళ్ళి వెనక్కు రమ్మని స్వమిజీ సైగ చెసారు. అంతె రెండంగల్లొ స్వమిజీ పాదల దగ్గరకి చెరుకున్నను, చెయి జాపి నా దొసిలిలొకి ఎదొ వస్తువు జార విడిచారు !!! కళ్ళళ్ళొ నీళ్ళు ఉబికి వస్తుండగా, గుందె గొంతుకలొకి జారి, కన్నీళ్ళు తుడుచుకుని చూద్దునుకదా ఇదిగొ ఈ విగ్రహం నా చెతుల్లొ ఉన్నది. మీరె చూడండి శ్రీ హనుమత్ సమేత శ్రీ సితా రామ లక్ష్మణ కలిగిన బంగారు విగ్రహాన్ని. ఈ ఆనంద కరమైన విషయాన్ని మీ అందరితొటి పంచుకొవాలనె ఈ ప్రయత్నం, అంతె కాని నెనెదొ పెద్ద భక్తుడిని అనిగాని, చాలా గొప్పవాడిని అనిగాని నెను అనుకొవతంలెదు.