బజార్ హంపి యాత్ర. ఈ మధ్య హంపి నగరం చూడటానికి వెళ్ళాను. విజయనగర సామ్రాజ్యం ఆ వైభోగం మీకందరికీ తెలిసే ఉంటుంది. "అంగళ్ళ రతనాలు అమ్మినారట అచట". ఈ పాట మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఈరోజు మనం హైదరాబాదు, బెంగుళూరు లాంటి మహా నగరాలలో కూడా బహుశ అటువంటి విశాలమైన బజార్లు చూడలేము. ఈ కింది ఫోటో శ్రీ విరుపాక్ష బజార్. ఎంత విశాలంగా ఉన్నదో చూసారు కదా. ౩౦౦ అడుగుల విశాలమైన వీధిలో ఆరోజుల్లో అంగళ్ళలో రతనాలు రాసులుగా పోసి అమ్మేవారని తెలుస్తోంది. ఈరోజుల్లో రతనాలు ఎలా అమ్ముతున్నారో మీకు తెలుసు. రోడ్లమీద రతనాలు కాదు కదా కూరగాయలు కూడా అమ్ముకునే పరిస్థి లేదు, నడిచే వాళ్ళకు చిన్న చిన్న వ్యాపారస్తులకు వీధిలో నిలపడే చోటే లేదు, పైనుంచి వాళ్ళ ప్రాణాలకు గాని మానానికి గాని రక్షణ లేనే లేదు. ఇహ రతనాలు అమ్మే సంగతే లేదు. (విరుపాక్ష బజార్)
స రి గ మ లు పలికే స్తంబాలు ఎంతోఅపురూపమైన శిల్పాలు, చుడటానికి ఎన్ని కళ్ళైనా చాలవు.
ఈ ఫోటో సప్తస్వరాలు పలికే సభా మంటపానిది. ప్రస్తుతం ఎవ్వరిని తాకనివ్వటం లేదు.
లొటుస్ మహల్ (lotus mahal )