మీరేమంటారు ? ప్రపంచం లో రక రాకా లైన మనుషులు ఉన్నారు కదా. అందులో నల్లని వాళ్ళు ఎర్రని వాళ్ళు అందమైన వాళ్ళు, అదృష్టవంతులు, దురదృష్టవంతులు వగైరా వగైరా. ఐతే ఇందులో నేను గమనించిందేమిటంటే ఒక రక మైన మనుషులు అందరు ఒక దగ్గర పుడుతూ ఉంటారు. అంటే వ్యాపారం చేసుకునే వారు లేదా ఉద్యోగం చేసుకునే వారు లేదా రాకరాక లైన వృత్తులు చేసుకునే వాళ్ళు ఒకే రకంగా అంటే ఆలోచన, ఆచరణ వ్యవహారం వగైరా ఒకే రకంగా ఉన్నట్టు కనిపిస్తోంది. గుణ కర్మ ల ప్రకారంగా విభాగం చేసారేమో విధాత ఇంతకూ మునుపు, కాని ఇప్పుడు ఆ పద్దతి కనిపించటం లేదు. ఉదాహరణకి ఒక రైల్వే కానీ రోడ్డు రావాన సంస్థ లో కానీ వివిధ భాగాల లోని ఉద్యోగస్తులు ఒక్కో రకంగా అంటే మెకానిక్ డిపార్టుమెంటు లో ఉద్యోగస్తులు లేదా అపరాషన్స్ లో పని చేసే వారు లేదా కమర్షియల్ విభాగం లో పని చేసే వారు అంతా ఒకే లాగ పని చేయటమే కాదు ఒకేలాగా ఆలోచన, ఆచరణ కలిగిన వారై ఉంటారు. వాళ్ళ జీవన విధానం, ఆర్ధిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి వగైరా విషయాలలో కూడా ఒక సారూప్యం కనిపింస్తుంది. మరి కొంత కాలం గడిస్తే ఇప్పుడు మనం చూస్తున్న కుల మత వ్యవస్థ పోయి ఒక కొత్త వ్యవస్థ రావచ్చు. అందులో సాఫ్ట్వేర్ కులం, హార్డువేర్ కులం బిజినెస్ క్లాసు కులం ( అంటే ఇప్పటి కోమటి వారు కాదు ) వృత్తుల వారి కులాలు (డ్రైవర్, ప్లంబెర్, కార్పెంటర్ వ్యవసాయ కూలి కులం ). పూజలు ఎవరైనా చేయ వచ్చు ఒకే కులం వారు చేయాలనీ లేదు. అలాగే మంగలి పని వాళ్ళ కులం వారే చేయాలనీ లేదు ( దయ చేసి నేను ఎవరిని కించ పరచాలని కానీ ఎవరిని బాధ పెట్టాలని కాని ఇదంతా వ్రాయటం లేదని భావించగలరు). ఈ మార్పూ రావాటానికి మరెంతో కాలం పట్టక పోవచ్చు. మన దేశం లో ఇప్పటికే ఎంతో మార్పు ఒచ్చింది . మీరేమంటారు???
1 comment:
ఇండియా లో కులాలు లేకపోతే రిజర్వేషన్లు ఎలా ?
రిజర్వేషన్లు లేకపోతే రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి ?
రిజర్వేషన్లు లేని ఇండియాను ఊహించగలరా ?
Post a Comment