Thursday, November 12, 2009

మీకు తెలుసా?

మీకు తెలుసా?   మనం ప్రతి నిముషం గాలి పీలుస్తూ ఉంటాము, పగలు రాత్రి విరామం లేకుండా! ఇందులో తెలియని విషయం ఏమిటి అనే కదా మీరు అనుకుంటున్నారు, ఆగండి ఆగండి, అక్కడే ఉంది తమాషా! 
        మనం (అంటే ఆరోగ్యంగా ఉన్న వారు అందరు) ప్రతి రెండు గంటలకు ఒకసారి మన నాసిక లోని ఎడమ రంధ్రం నుండి కుడికి కానీ కుడి నుండి ఎడమకు కానీ మార్చి మార్చీ గాలి పీలుస్తూ ఉంటాము.  ఈవిధం గా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే దాక మనకు తెలియ కుండానే జరిగిపోతుంది. అలాగే మనకు అనారోగ్యం చేసినప్పుడు ఈ పద్దితి మారి పోతుంది. సామాన్యంగా మీకు జలుబు చేసినప్పుడు ఈ విషయం బాగా అర్థం అవుతుంది.
       ఇందులో ఇంకా మనకు తెలియ కుండా జరిగే విషయం ఏమిటంటే, మన శరీరం అనారోగ్యానికి గురియినప్పుడు మనకుతెలియకుండానే దాన్ని బాగుచేసుకునే వ్యవస్థ మనలోనే ఉన్నది, అంటే కొద్దిపాటి అనారోగ్యం ఐతే వెంటనే బాగు పడిపోతుంది.  ఉదాహరణకు మీకు బాగా వేడి చేసిన్దనుకోండి ( ఆ వేడి కుడా !) అపుడు మీరు గమనించండి మీ కుడి పక్క  నాసిక రంధ్రం లోనుండి గాలి ధారాళంగా వీస్తుంది.  అల్లాగే బయట వాతావరణం చల్లగా ఉన్నదనుకోండి అప్పుడు కూడా కుడి పక్క ముక్కు పని చేస్తుంటుంది. బాగా జ్వరంగా ఉన్నప్పుడు మీ కుడి పక్క ముక్కులోంది గాలి వీస్తుంది. మీకు తలనెప్పి అనిపిస్తే కుడా మీరు  ఈ విషయాన్నీ గమనించవచ్చు. అప్పుడు మీరు గనక ఎడమపక్క ముక్కులోనించి గాలి పీలవ గలిగితే మీ అనారోగ్యం నెమ్మదిస్తుంది.
     మీరు ఆరోగ్యవంతులా కదా అనే విషయం తెలుసుకోవాలంటే ఈ విధం గా తెలుసుకోండి.  ఆదివారం ఉదయం ఆరు గంటలకు మనకు కుడి పక్క ముక్కు పని చేస్తూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా సూర్యోదయంతో పాటు  అన్నమాట. అలాగే సోమవారం ఉదయం నాడు మీ కుడి ముక్కు పని చేస్తూ ఉంటుంది! అంటే రవి వారం కాబట్టి కుడి పక్క ( రవి వేడిని పుట్టిస్తాడు కాబట్టి కూడా) సోమ వారము,  అంటే సోముడంటే చంద్రుడు కదా! అందు వలన ఎడమ ముక్కు లో నుంచి గాలి వీస్తుంది. అంటే చల్లదనాన్ని చంద్రుడు ఇస్తాడు కదా. ఈ విధంగా మంగళవారం ఉదయం నాడు మళ్ళి కుడి పక్క బుధవారం నాడు మళ్ళి ఎడమపక్క, తిరిగి గురు వారము నాడు కుడిపక్క, శుక్రవారం నాడు ఎడమపక్క, కానీ శనివారం ఆది వారము మాత్రం కుడి పక్క నుండే గాలి (ఉదయం ఆరు గంటలకు సమానమైన వేళలో) వీస్తూ ఉంటుంది.  "గాలి" కబురులెన్నో ఇంకా చెప్పాలని ఉన్నది కాని వేళ మించి పోవటం వలన ఈసారికి ఇంతే.  మళ్ళి త్వరలో నే కలుద్దాం.

No comments: